Site icon TeluguMirchi.com

ఫాదర్స్ డే సందర్భంగా చిరు ఎమోషనల్ పోస్ట్

ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా లో ప్రతి ఒకరు తమ తండ్రి గురించి చెప్పుకుంటూ చిన్నప్పటి విషయాలను షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఓ కొడుకుగా త‌న తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఓ తండ్రిగా త‌న కొడుకుతో ఉన్న అనురాగాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు .

చిరంజీవి తండ్రి వెంక‌ట్రావు, రామ్‌చ‌ర‌ణ్ తేజ్ ను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన చిరంజీవి ‘‘చిరుత విత్ మై ఛార్మింగ్ డాడ్. మా నాన్న నవ్వు …నా బిడ్డ చిరునవ్వు…రెండు నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే’’ అని మెసేజ్ పోస్ట్ చేశారు.

Exit mobile version