Site icon TeluguMirchi.com

పోలీసు బెటాలియన్‌లో 12 మందికి కరోనా…

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్తగూడెం సమీపంలోని చాతకొండలో ఉన్న పోలీసు బెటాలియన్‌లో 12 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. వీరంతా హైదరాబాద్‌లో బందోబస్తు విధులు నిర్వహించడానికి వెళ్లొచ్చారని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తించిన వీరు ఇటీవలే కొత్తగూడెం తిరిగొచ్చారని తెలుస్తోంది.

వీరందరికీ చాతకొండలోని బారక్‌లోనే చికిత్స అందించనున్నారు. ప్రగతి భవన్‌లో ఇటీవలే ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడిన పడ్డారు. అలాగే పాల్వంచలో ఐదుగురికి ..భద్రాచలం పట్టణానికి చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

Exit mobile version