Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన సాక్షి శివ..

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది.

ఇప్పటికే పలువురు నిర్మాతలు , బుల్లితెర నటులు కరోనా బారిన పడగా..తెలుగులో అనేక సీరియల్స్ లో నటించిన రవి కృష్ణ సోకగా.. .తాజాగా మరో టీవీ నటుడు సాక్షి శివ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డాడు. అక్క మొగుడు, నెంబర్‌ వన్ కోడలు, మౌనరాగం వంటి సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆయనతో నటించిన నటీనటులలో భయాందోళనలు నెలకొన్నాయి.

Exit mobile version