Site icon TeluguMirchi.com

సుమలతకు కరోనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. సామాన్య ప్రజలే కాక రాజకీయ నేతలు , పోలీసులు , డాక్టర్స్ , బిజినెస్ రంగానికి చెందినవారు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు దీని బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా వైరస్ పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఎంపీగా ఉన్న సుమలత తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను ఇటీవల ఆమె సందర్శించారు. ఈ క్రమంలోనే ఆమెకు వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version