
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 15,516 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,461కి చేరింది. ఇందులో 1,69,461 కేసులు యాక్టివ్ గా ఉంటె, 2,27,755 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,205 పాజిటివ్ కేసులు ఉండగా, 5,984 మంది బాధితులు మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 56,845కి చేరింది. రాష్ట్రంలో 704 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 56,746 పాజిటివ్ కేసులు నమోదవగా, 2,112 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 26,680 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడినవారిలో 1638 మంది మరణించారు. అత్యధిక కేసుల జాబితాలో ఐదోస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 16594 కేసులు నమోదవగా, 507 మంది మరణించారు.
