Site icon TeluguMirchi.com

దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య ఎంతో తెలుసా..?

కరోనా మహమ్మారి దేశంలో బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. అలాగే పాజిటివ్ కేసులు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,586 మందికి క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది.

ఒక రోజు వ్యవధిలో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొద‌టిసారి. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 163248గా ఉంది. ఇక కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12,573కు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాధి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 2,04,710 మంది కోలుకున్నారు.

Exit mobile version