
దేశ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఎందుకంటే కరోనా వైరస్ మునపటి కంటే తీవ్రతరం అయ్యింది. తగ్గిపోతుంది అనుకునే చైనాలో కూడా నిన్న 32 కేసులు రాగా… ఇవాళ ఇప్పటికే… 27 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక బ్రెజిల్‌లో నిన్న ఒక్క రోజే 55వేల కేసులు నమోదవ్వడంతో… ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జాగ్రత్తపడుతుంది.
తాజా లెక్కలను చెక్ చేసిన WHO… ప్రపంచ దేశాలకు అర్జెంటుగా ఓ హెచ్చరిక పంపింది. కరోనా కొత్త, ప్రమాదకర దశలోకి వెళ్లిందనీ, ప్రపంచ దేశాలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. వారం నుంచి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఒక్క రోజే… లక్షా 81వేల కొత్త కేసులు… 5066 కొత్త మరణాలూ సంభవించడాన్ని బట్టీ… కరోనా ఎంత డేంజర్ దశలోకి వెళ్లిందో అని WHO అంటుంది. ప్రజలు ఇళ్లల్లో ఉండట్లేదనీ… ప్రభుత్వాలు మినహాయింపులు ఇచ్చేయడం కొంపలు ముంచుతోందని చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రజలు మాత్రం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని చెపుతుంది.
