Site icon TeluguMirchi.com

ఆగష్టు 15లోగా కరోనా వ్యాక్సిన్ లాంచ్..ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో అగ్ర రాజ్యాలన్నీ బిజీ అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాక్సిన్ పేరిట రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి తేనున్నట్లు ఐసీఎంఆర్ తెలిపి ఆనందం నింపింది.

ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ దేశంలోని 12 హాస్పిటళ్లను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు వాటికి లేఖ రాసింది. ఐసీఎంఆర్, పుణేలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఐసీఎంఆర్ హాస్పిటళ్లను కోరింది. ఈ 12 హాస్పిటళ్లలో హైదరాబాద్‌‌కు చెందిన నిమ్స్‌తోపాటు విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉన్నట్లు సమాచారం.

Exit mobile version