Site icon TeluguMirchi.com

దాసరి కుమారుల ఆస్తి గొడవ ..

దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారులు ప్ర‌భు, అరుణ్ కుమార్‌ల మ‌ధ్య ఆస్తి పంచాయ‌తీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జూన్ 24 రాత్రి తొమ్మిదిన్న‌ర గంటల స‌మ‌యంలో అరుణ్ గేటు దూకి త‌న ఇంట్లోకి వ‌చ్చిన‌ట్టు ప్ర‌భు ఆరోపిస్తున్నారు. గేటుకు తాళం వేసి ఉండగా… దూకి..ఇంట్లోకి వచ్చిన అత‌ను నన్ను, నా భార్యను, మామయ్యను దుర్భాషలాడినట్లు ప్రభు ఆరోపిస్తున్నారు. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీసులను కూడా ప్రభు ఫిర్యాదు చేశారు.

త‌మ ఆస్తి వివాదంపై టాలీవుడ్ పెద్ద‌లు మోహ‌న్ బాబు, క‌ళ్యాణ్‌, ముర‌ళీ మోహ‌న్ వంటి వారు స్పందించాల‌ని కోరుతున్నాను అని ప్ర‌భు పేర్కొన్నాడు. ఎంతో మంది పెద్ద‌ల‌ని క‌లిసిన స‌మ‌స్య తీర‌లేదు. తాను ఉంటున్న ఇల్లు తన తండ్రి దాసరి మనవరాలి పేరు మీద రాసి ఇచ్చారన్నారు. తన కూతురు పేరు మీదున్న ఇంటిలోనే తాను ఉంటున్నానన్నారు. విల్లు ప్రకారమే తాను ఆ ఇంటిలో ఉంటున్నట్లుగా తెలిపారు. కోర్టులో దీనిపై కేసు కూడా నడుస్తోందన్నారు. దాస‌రి అరుణ్ వ‌ల‌న మాకు ప్రాణ హాని ఉంద‌ని ప్రభు స్ప‌ష్టం చేశాడు.

Exit mobile version