Site icon TeluguMirchi.com

ప్రభాస్ కు దీపికా కండిషన్స్


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కనున్న ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా పూజా హగ్దే నటిస్తుంది. కాగా ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు స్టార్ క్యాస్ట్ సైతం భారీగా ఉండనుంది. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ సినిమా కోసం తీసుకోనున్నారు. అలాగే వివిధ సాంకేతిక విభాగాలకు సంబంధించి హాలీవుడ్ నిపుణులను తీసుకోబోతున్నారు. కాగా ఈ మూవీ లో హీరోయిన్ గా దీపికా పదుకొనె ఐతే బాగుంటుంది అనే ఆలోచన దర్శక నిర్మాతలలో ఉంది. ఈ విషయంపై దీపికతో చర్చించగా ఆమె సుముఖంగానే ఉన్నారట. ఐతే ఆమెకు ఆ చిత్ర హిందీ విడుదల హక్కులు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. మరి ఈ కండీషన్ కి ఒకే అంటే ప్రభాస్ చిత్రంలో నటిస్తాను అని ఆమె అంటున్నట్లు వినికిడి. మరి ఆమె కండిషన్ కు ఓకే చెపుతారా లేదా అనేది చూడాలి.

Exit mobile version