Site icon TeluguMirchi.com

దేవరశాంటా : ఈ సారి చాలా ఖరీదైన గిఫ్ట్ … అదృష్టవంతులు ఎవరో !


లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పెద్దగా బయట కనిపించింది లేదు. మొదటి నుంచి విజయ్ ను స్టార్ గా చేసింది అతను సోషల్ మీడియా లో ఎప్పుడూ అభిమానులకు దగ్గరగా ఉండడం, వారికి అండగా, అవసరమైనవి ఇస్తూ ఉండడంతో విజయ్ వారికి చాలా స్పెషల్ గా మారాడు. కరోనా సమయంలో విజయ్ ఎంతోమందికి హెల్ప్ చేశాడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం క్రిస్టమస్ సమయంలో దేవర శాంటా గా మారిపోతాడు. గత ఐదేళ్ల నుంచి విజయ్.. దేవర శాంటా గా మారి అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ అందిస్తున్నాడు. తాజాగా మరోసారి దేవర శాంటా వచ్చేశాడు. ఈసారి తన అభిమానులను హాలిడే ట్రిప్ కు పంపనున్నట్లు తెలిపాడు. దేవర శాంటా 5వ వార్షికోత్సవం కావడతో అభిమానులను హాలిడే ట్రిప్ కు పంపుతున్నట్లు తెలిపాడు ”నేను మీలో 100 మందిని అన్ని ఖర్చులతో కూడిన హాలిడేకు పంపబోతున్నాను. డెస్టినేషన్ సెలెక్ట్ చేసేందుకు నాకు హెల్ప్ చేయండి” అని ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇక రౌడీ అభిమానులు ఈ విషయం తెలియడంతో సంబరపడుతున్నారు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడాలి.

Exit mobile version