Site icon TeluguMirchi.com

ఎమోషనల్ పోస్ట్ పెట్టిన దిల్ రాజు కూతురు

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదటి భార్య అనిత కుమార్తె హ‌న్షిత సోషల్ మీడియా లో తన తల్లి పిక్ ను పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. కొద్దీ రోజుల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్ని రోజులు ఒంటరిగా జీవనం సాగించిన రాజు..లాక్ డౌన్ సమయంలో రెండో వివాహం చేసుకున్నాడు.

తాజాగా త‌ల్లికి సంబంధించిన బాల్య జ్ఞాప‌కాన్ని షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది హ‌న్షిత. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా … నిన్ను చాలా మిస్ అవుతున్నా.. ఇప్ప‌టికీ ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. నీతో ఎన్నో జ్ఞాపకాలు.. నేను ఎక్కువగా నీతో కలిసి ఫోటోలు దిగాను. నీ చిరునవ్వు దృశ్యాల చిత్రాలెన్నో. నీ దృష్టిలో ప్రేమ అంటే… ఎప్పటిలాగే నన్ను గట్టిగా కౌగిలించుకోవ‌డం.“ అంటూ ఎమోషన్ అయ్యారు హన్షిత.

Exit mobile version