
సిద్దు జొన్నలగడ్డ – నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ రూపొందించిన చిత్రం ‘డీజే టిల్లు’. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల దీనికి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.
ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ఫిబ్రవరి 12 న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా..ఇక ఇప్పుడు బుల్లితెర ఫై సందడి చేసేందుకు సిద్ధమైంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చే ఆదివారం ఈ చిత్రం స్టార్ మా లో సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. మరి బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.
