
కరోనా వైరస్ కారణంగా ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జులై 01 న జరగాల్సిన ప్రవేశ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. అయితే ఈ వాయిదా పడిన ప్రవేశ పరీక్షలను ఆగస్టు రెండో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో వీటి నిర్వహణకు ఆగస్టు మొదటి వారం వరకు తేదీలు ఖాళీ లేకపోవడంతో ఆగస్టు రెండో వారంలో నిర్వహించే యోచనలో ఉన్నత విద్యామండలి వర్గాలు ఉన్నట్లు సమాచారం. జులై 18-23 తేదీల మధ్య జేఈఈ మెయిన్ నిర్వహిస్తామని గతంలోనే జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) తేదీలు వెల్లడించింది. ఈ పరీక్షలను కూడా టీసీఎస్ అయాన్ సంస్థనే నిర్వహిస్తోంది.
