Site icon TeluguMirchi.com

గణేష్ లో మార్పు తీసుకొచ్చిన కరోనా ..

బండ్ల గణేష్ ఈ పేరు మీడియాలో ఎప్పుడు వైరలే..సినిమా ఫంక్షన్ లో ఈయన మాటలైనా..రాజకీయ మాటలైనా సరే ఆయన మాట్లాడాడంటే అది వైరల్ కావాల్సిందే. ఈ మధ్య 7 ఓ క్లోక్ బ్లెడ్ తో ఫుల్ పాపులర్ అయినా గణేష్..ఈ మధ్య సోషల్ మీడియా లో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా ఈయన కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నాడు. 14 రోజుల క్వారంటైన్ సమయంలో తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తాను ఏ విషయాల్లో రియలైజ్ అయ్యాను వంటి విషయాలను తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

‘‘రాజకీయాల మీద ఇప్పుడు నాకు అస్సలు ఆసక్తిలేదు. కరోనా రాక ముందు చాలా ఆలోచనలు ఉండేవి. అలా చేద్దాం, ఇలా చేద్దాం, చంపేద్దాం అనుకునేవాడిని. కరోనా సోకిన 14 రోజుల తరవాత నా ఆలోచనే మారిపోయింది. అసలు నేనేంటి, ఎందుకు పుట్టాను, ఎక్కడున్నాను, మనకెందుకు ఇవన్నీ, సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఈ స్టేటస్ అనుభవిస్తున్నాను, ఇంకా దేని కోసం నేను పాకులాడాలి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, ఈ చిన్న జీవితం కోసం వాడితో గొడవ వీడితో గొడవ, కాంట్రవర్సీ అవసరమా అనిపించింది. అనవసరమైన టాపిక్‌లు వద్దు.. మనం ఒక మాటంటే వాడు పది మాటలంటాడు. తప్పు ఎవరిదైనా కానీ.. కామ్‌గా ఉందాం, మన పని మనం చేసుకుందాం’’ అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version