Site icon TeluguMirchi.com

నాగ్ ‘ఘోస్ట్’ మూవీ రిలీజ్ డేట్


బంగార్రాజు తో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున.. ఘోస్ట్ గా రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నారాయన్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది . ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహాన్ నాగ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
క్రేజీ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు రేపింది.

షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్ కిల్లింగ్ మెషిన్ ని కొద్దిసేపటి క్రితమే చిత్రయూనిట్ విడుదలచేసింది. టీజర్ లో పెద్ద కట్టి పట్టుకొని అపోనెంట్స్ ని నరుకుతూ నాగ్ స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Exit mobile version