
డైరెక్టర్ బి గోపాల్ అంటే తెలియని సినీ అభిమాను ఉండడు. కలెక్టర్ గారి అబ్బాయి, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, స్టేట్ రౌడీ , మెకానిక్ అల్లుడు, సమరసింహా రెడ్డి, ఇంద్ర వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందజేసి మాములు హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన గొప్ప డైరెక్టర్.
అలాంటి డైరెక్టర్ తో నటసింహ బాలకృష్ణ తో వర్క్ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో సమరసింహా రెడ్డి చిత్రం వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు చేసింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందని ఆ మధ్య గట్టిగానే వార్తలు వినిపించాయి. కానీ వీరి కాంబో సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది.
స్క్రిప్ట్ సెట్ అవ్వక ఈ సినిమా క్యాన్సల్ అయిందట. దాంతో పూరి జగన్నాథ్- బాలయ్య సినిమా ముందుకు వచ్చే అవకాశం ఉంది. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలయ్య కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నాడట. ఇప్పటికే పూరి, బాలయ్యకి ఫోన్ లోనే కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
