Site icon TeluguMirchi.com

గౌతమ్ వెబ్ సిరీస్ ప్లాన్..

వైవిధ్య చిత్రాలతో తెలుగు , తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న గౌతమ్ మీనన్..ప్రస్తుతం తన మూడు సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్ చేసేందుకు సిద్దమయ్యాడనే వార్తలు మొన్నటి వరకు చక్కర్లు కొట్టగా..తాజాగా ఈయన ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.

ఇటీవల లాక్ డౌన్ సమయంలో ”కార్తీక్ డయిల్ సయిద ఎన్” అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు . ఈ షార్ట్ ఫిలిం లో త్రిష, శింబు నటించారు. ఎవరింట్లో వారు ఉండి షూట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం కు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కాగా ఇప్పుడు ఈ దర్శకుడు ఓ వెబ్ సిరీస్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్‌ . స్టోరీ విషయంలో ఇటీవల చర్చలు జరగగా, అమెజాన్ వారికి నచ్చడంతో వెబ్ సిరీస్‌ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ వెబ్ సిరీస్‌కి పని చేయనున్నారు. లాక్‌డౌన్ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Exit mobile version