Site icon TeluguMirchi.com

గ్రామ సర్పంచ్ గా అల్లు అర్జున్ సోదరుడు..?

Pushpa first look

అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. బన్నీ 38 వ పుట్టిన రోజు సందర్భాంగా చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ మూవీలో కథానుగుణంగా అల్లుఅర్జున్ కు ఇద్దరు సోదరులుంటారట. వీరిలో ఓ సోదరుడు గ్రామ సర్పంచ్ గా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. కొద్దిగా పొలిటికల్ టచ్ ఇస్తూనే ఈ సినిమా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version