Site icon TeluguMirchi.com

అందాల హీరో హరనాథ్ కూతురి హఠాన్మరణం


ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా “గోకులంలో సీత, తొలిప్రేమ” వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.

Exit mobile version