Site icon TeluguMirchi.com

హరిహర వీరమల్లు ఈ సారైనా వచ్చేనా ?


పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో సూర్య మూవీస్ బ్యానర్ ఫై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ మొదలు పెట్టి చాల రోజులే అవుతున్నప్పటికీ..ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ రాంపాల్, నర్గిస్ ఫఖ్రి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూడు సార్లు మార్చారు. గత ఏడాది వేసవికాలంలో రావాల్సిన సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో దసరాకు మార్చారు. ఆ తరువాత అదీ కాదు సంక్రాంతి 2023 అని అనధికారిక సమాచరం అందించారు. ఇక చివరిగా ఈ సినిమాను 2023 మార్చి 30వ తేదీన పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ డేట్ కు కూడా సినిమా వస్తుందా రాదా అనే అనుమానం అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో కూడా వ్యక్తం అవుతుంది.

Exit mobile version