
పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో సూర్య మూవీస్ బ్యానర్ ఫై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ మొదలు పెట్టి చాల రోజులే అవుతున్నప్పటికీ..ఇంకా పూర్తి కాలేదు. మధ్య లో కరోనా రావడం..అదే టైం లో పవన్ భీమ్లా నాయక్ స్టార్ట్ కావడం తో హరిహర వీరమల్లు ఆలా ఉండిపోయింది. ప్రస్తుతం మిగిలి ఉన్న షూటింగ్ ను పూర్తి చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు.
రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ దాదాపు పూర్తయినట్లే అంటున్నారు. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్.
