Throwback : సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు పెద్ద స్టార్స్ కలిసి నటించడమే గ్రేట్ అంటాం. మరి ఒకే షార్ట్ ఫిల్మ్‌లో నలుగురు టాప్ స్టార్స్… అందులో ఇద్దరు కోలీవుడ్ బిగ్గెస్ట్ హీరోలు, ఒక టాలెంటెడ్ ప్యాన్-ఇండియా యాక్టర్, మరియు ఒక బ్రైట్ హీరోయిన్… వీరంతా కలిసి నటించారు అంటే మీరు నమ్ముతారా? అవును, అది నిజం! చాలా మందికి బహుశా తెలియని ఒక అద్భుతమైన ఫిల్మ్ అది.
మనం మాట్లాడుకుంటున్న షార్ట్ ఫిల్మ్ పేరు “హీరోవా? జీరోవా?” (Herova? Zerova?) ఇది 2008లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసింది కాదు! తమిళనాడులో బాల్య విద్య యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, అలాగే చిన్న వయసులోనే స్కూల్ మానేసి చైల్డ్ లేబర్‌గా మారిన పిల్లల గురించి అవగాహన కల్పించడానికి తీసిన ఒక పవర్‌ఫుల్ డాక్యుడ్రామా ఇది.
ఎవరెవరున్నారు ఈ స్టార్ స్టడెడ్ ప్రాజెక్ట్‌లో.?
సూర్య.. ఈ ప్రాజెక్ట్‌కు కేవలం యాక్టర్‌గానే కాదు, తన అగరం ఫౌండేషన్ ద్వారా దీన్ని నిర్మించారు. విజయ్.. దళపతి విజయ్ కూడా ఇందులో ఒక పార్ట్. జ్యోతిక.. సూర్య భార్య, టాలెంటెడ్ యాక్ట్రెస్ జ్యోతిక కూడా ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్నారు. ఆర్. మాధవన్.. తన నటనతో ప్యాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన మాధవన్ కూడా ఇందులో ఉన్నారు. వీరంతా ఈ షార్ట్ ఫిల్మ్‌లో తమ పాత్రల్లోనే, అంటే తమ నిజ జీవిత రూపాల్లోనే కనిపించి, విద్య కోసం గట్టిగా అడ్వకేట్ చేశారు.
బిహైండ్ ది సీన్స్ అండ్ ఇంపాక్ట్..
ఈ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకురాలు వి. ప్రియ. సినిమాటోగ్రఫీ అంటేనే గుర్తొచ్చే కె.వి. ఆనంద్ దీనికి కెమెరా వర్క్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ హారిస్ జయరాజ్ సంగీతం అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉందో, అంతే అద్భుతమైన టెక్నికల్ టీమ్ కూడా ఇందులో భాగమైంది.
తమిళనాడు విద్యా మంత్రిత్వ శాఖ ఈ చిత్రాన్ని స్పాన్సర్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి ము. కరుణానిధి గారు స్వయంగా తన కవితను ఈ సినిమా ఇంట్రోలో చదవడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత గౌరవాన్ని తెచ్చింది.
“హీరోవా? జీరోవా?” అనే ఈ షార్ట్ ఫిల్మ్, పిల్లలు స్కూల్లోనే ఉండాలని, చదువే జీవితంలో హీరోగా నిలబెడుతుందని, లేకపోతే జీరో అవుతారని గట్టి మెసేజ్ ఇచ్చింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, తమిళ సినిమా చరిత్రలో సోషల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ల విభాగంలో ఒక ముఖ్యమైన గుర్తు!
ఇదిలాంటి గొప్ప ప్రాజెక్టులు, సినిమా స్టార్స్ పవర్ ని మంచి కారణాల కోసం ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాయి! మీకు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి తెలుసా? లేకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు కదూ..!

