Site icon TeluguMirchi.com

బాలీవుడ్‌లో మరో విషాదం..

బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినీ ప్రముఖుల మరణాలు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు మరణించగా..తాజాగా సీనియర్ నటుడు జగ్‌దీప్ (81) కన్నుమూశారు. బుధవారం రాత్రి 8.40 నిమిషాలకు తన ఇంట్లోనే కన్నుమూసినట్లు సమాచారం. వయసు పైబడటంతో అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు.

ఈయన మరణ వార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జగ్‌దీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ జాఫ్రీ. సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం ‘జగ్‌దీప్’ పేరుతో ఫేమస్ అయ్యారు. బాల నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దాదాపు 400 లకు పైగా చిత్రాల్లో నటించారు.

రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’లో జగ్‌దీప్ పోషించిన సూర్మా భూపాలీ పాత్ర ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇకపోతే ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాలో సల్మాన్ ఖాన్ తండ్రిగా ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Exit mobile version