
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క అగ్ర హీరోగా రాణిస్తూనే..మరోపక్క నిర్మాతగా తన సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే చిరంజీవి తో రెండు భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ సాధించిన చరణ్..ప్రస్తుతం కొరటాల – చిరంజీవి కలయికలో చిరు 152 వ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన మోహన్ లాల్ చిత్రం ‘లూసిఫర్’ హక్కుల్ని కొనుగోలు చేసాడు చరణ్.
ఈ చిత్రాన్ని చిరంజీవితో నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యత సాహో డైరెక్టర్ సుజిత్ కు ఇచ్చాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడు. ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ లో జగపతి బాబు ఓ కీలక రోల్ చేయనున్నాడట. ఈ విషయమై వీరి మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
