Site icon TeluguMirchi.com

వారసులకు షాక్ ఇచ్చిన కరణ్ జోహార్..

సుశాంత్ మరణం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ లో కలకలం రేపుతోంది. అవకాశాలు లేకనే ఆయన ఆత్మ హత్య చేసుకున్నాడని అంత అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ప్రోత్సహించరని ఎందరో హీరో హీరోయిన్లు ట్వీట్లు చేస్తున్నారు.అలాంటి వారి వల్లే సుశాంత్ వంటి ప్రతిభావంతుడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పెద్ద ఎత్తన సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. అలాగే నిర్మాత కరణ్ పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం సినీ ప్రముఖుల వారసులతో మాత్రమే ఆయన సినిమాలు తీస్తున్నాడు. స్టార్లు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడనికి కరణ్ నే ఎంచుకుంటారు. ఈ నేపథ్యం లోనే కరణ్ బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ప్రోత్సహించడం లేదని విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. కరణ్ జోహార్ కొన్నాళ్ల పాటు తన బ్యానర్ లో స్టార్ వారసుల సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు ప్లాన్ చేసినా కూడా వాటిని క్యాన్సిల్ చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడట.

Exit mobile version