Site icon TeluguMirchi.com

సరోజ్ ఖాన్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ ప్రముఖులు సరోజ్ ఖాన్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ సైతం సరోజ్ ఖాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. సరోజ్‌ఖాన్ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు. సరోజ్‌ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు.

Exit mobile version