
ఇళయదళపతి విజయ్ పుట్టిన రోజు నిన్న (జూన్ 22). ఈ సందర్భాంగా అభిమానులు , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటం సరికాదని భావించిన విజయ్.. తమ ఫ్యాన్స్ ను కూడా రిక్వస్ట్ చేశాడు. కరోనా నేపథ్యంలో ఎవరూ పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని విజయ్ కోరడం ఈసారి వేడుకలకు అభిమానులు దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో నటి కీర్తి సురేశ్ మాత్రంవిజయ్ కోసం తాను వయోలిన్ ప్లే చేస్తున్న వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. ‘జీవితం చాలా చిన్నది నన్బా.. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి.. హ్యాపీ బర్త్ డే విజయ్ సార్.. మీ బర్త్‌డే సందర్భంగా మీకోసం చిన్న వీడియో’ అని ట్యాగ్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంది.
