
మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకుంది. అయితే ఆమె స్టోరీ సెలక్షన్ వర్క్ అవుట్ అవ్వలేదో? లేక మరి ఏమిటో తెలియదు. కానీ ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్ ఫలితాలు అందుకుంటూ వస్తుంది. అయితే ఆమె చేసిన సర్కారు వారి పాట సినిమా మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ప్రస్తుతానికి ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఆమె ముఖంలో మార్పులు కనిపించాయని ఆమె అభిమానులు గుర్తించారు. కీర్తి సురేష్ లిప్ సర్జరీ చేపించుకుందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే ఈ విషయాన్ని కీర్తి సురేష్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
తమను తాము అందంగా చూపించుకోవడం కోసం హీరోయిన్లు సర్జరీ చేపించుకోవడం సర్వసాధారణం. అయితే కీర్తి చేయించుకున్న లిప్ సర్జరీ కారణంగానే కీర్తి సురేష్ గత సినిమాల కంటే మహేష్ సినిమాలో కాస్త భిన్నంగా కనిపించింది అని అంటున్నారు. ఇకపోతే కేవలం సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో ఒకే ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ప్రేక్షకులను పలకరించింది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాత్రమే ఆమె ప్రమోషన్స్ లో కనిపించింది. మిగతా ప్రమోషన్స్ బాధ్యత అంతా కూడా సినిమా యూనిట్ అలాగే దర్శకుడు పరశురామ్, మహేష్ బాబు తమ భుజాల మీద వేసుకుని పూర్తి చేశారు.
