
కోట శ్రీనివాస్ రావు..ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు. ఏ పాత్రైనా అవలీలగా చేయగల నటుడు. అందుకే ఈయనకు అన్ని రకాల పత్రాలు వచ్చి చేరాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం కోట ‘రోరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ లో తెలంగాణ సీఎం గా కనిపించబోతున్నాడు . ఈరోజు (జూలై 10న) కోట శ్రీనివాసరావు పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన లుక్‌ను ‘రోరి’ చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ చిత్రంలో ఆయన చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రిగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పాత్ర పేరు ఆర్. రామన్న చౌదరి. ఈ చిత్రాన్ని సీటీఎస్ స్టూడియోస్, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై చరణ్ రోరి నిర్మిస్తున్నారు.
