
మూగజీవులను ప్రేమించాలని..వాటి ఆకలి తీర్చాలని జంతు ప్రేమికులు చెపుతుంటే ..కొంతమంది దయ ప్రేమ లేని రాక్షసులు అతి దారుణంగా మూగజీవులను హింస్తున్నారు. తాజాగానీటి తొట్టెలో పడిందని కోతిని ఉరేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ..
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అక్కపాలెం గ్రామంలో సాదు వేంకటేశ్వరరావు అనే అతని ఇంటి ఆవరణలో నీటి తొట్టె ఉంది. ప్రమాదవశాత్తు ఆ ఖాళీ నీటి తోట్టిలో ఓ కోతి పడింది. అయితే యా మూగ జీవివి కాపడాల్సింది పోయి వెంకటేశ్వరరావు ఆ కోతిని కర్రతో కొట్టి చంపాడు. చంపి దానిని అక్కడే పడేయ్యటంతో వందలాదిగా కోతులు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు బతికి ఉన్న కోతిని చంపితే మిగతా కోతులు పారిపోతాయని చెప్పటంతో అక్కడే ఉండే మరో వ్యక్తి జోసెఫ్ రాజ్ సహయంతో మరో కోతిని పట్టుకొని దానిని కూడా ఉరి వేసి కుక్కలతో కరిపించుకుంటూ కర్రలతో కొట్టుతూ అతి దారుణంగా చంపి కుక్కలకు ఆహారంగా వేశారు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులే కాదు సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు.
