
యంగ్ హీరో నాగ శౌర్య నుండి వస్తున్న సరికొత్త మూవీ కృష్ణ వ్రింద విహారి. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసారు.
ఈ మూవీ లో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తుండగా..సీనియర్ నటి రాధికా కీలక పాత్రలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ లో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తుండగా మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించారు. మరి సినిమా టీజర్ ఫై లుక్ వెయ్యండి.
