
ఉప్పెన మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కృతి శెట్టి..ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ గా మారింది. తాజాగా సూర్య – బాల కలయికలో తెరకెక్కబోయే మూవీ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కృతి శెట్టి నటించిన చిత్రాలు చూసి ఆమె నటనకు ఫిదా అయినా బాల ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అలాగే టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ మూవీ కి గాను కృతి శెట్టి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు కోటి వరకు రెమ్యునరేషన్ అందుకున్న కృతి శెట్టి.. సూర్య సినిమాకు మాత్రం ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తంలో ఇచ్చేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
సూర్య జ్యోతిక సమర్పణలో 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ మూవీ నిర్మితం కానుంది.
