Site icon TeluguMirchi.com

వారిద్దరూ వద్దంటున్న మెగా ఫ్యాన్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క అగ్ర హీరోగా రాణిస్తూనే..మరోపక్క నిర్మాతగా తన సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే చిరంజీవి తో రెండు భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ సాధించిన చరణ్..ప్రస్తుతం కొరటాల – చిరంజీవి కలయికలో చిరు 152 వ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన మోహన్ లాల్ చిత్రం ‘లూసిఫర్’ హక్కుల్ని కొనుగోలు చేసాడు చరణ్.

ఈ చిత్రాన్ని చిరంజీవితో నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యత సాహో డైరెక్టర్ సుజిత్ కు ఇచ్చాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రను తెలుగు వర్షన్ లో సీనియర్ బ్యూటీ కుష్బూ, సుహాసిని వీరిద్దరిలలో ఎవరో ఒకరు నటించబోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు ఆ రోల్ కు సెట్ కారని మెగా అభిమానులు అంటున్నారు.

తెలుగు రీమేక్ లో స‌ర్ ప్రైజింగ్ ఉంటే బాగుండేది. ఇప్ప‌టికే తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా బోలెడ‌న్ని సినిమాల్లో కనిపించిన సుహాసిని అయినా, ఇప్ప‌టికే చిరంజీవికి సోద‌రి పాత్ర‌లో ఒకసారి న‌టించిన కుష్బూ అయినా.. బాగానే చేస్తారేమో కానీ, మ‌ళ్లీ పాత వాళ్లే అయితే స‌ర్ ప్రైజింగ్ ఉండ‌క‌పోవ‌చ్చు..తెలుగు వారికి కొత్త‌గా అనిపించే న‌టి ఎవ‌రైనా అయితే ఆస‌క్తి పెరుగుతుంది. సుహాసిని, కుష్బూ అంటే మాత్రం కొత్త సీసాలోకి పాత సారా పోసిన‌ట్టుగా అవుతుందేమో అని అంటున్నారు.

Exit mobile version