
అల్లుడు శ్రీను చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోగా పరిచమైన బెల్లం కొండ శ్రీనివాస్..ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ‘కందిరీగ’, ‘రభస’, ‘హైపర్’ వంటి కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్‌లో కపించబోతున్నారు. అందుకోసం శ్రీనివాస్ 8 ప్యాక్స్‌తో మేకోవర్ అయ్యారు. దీనికి సంబంధించి శ్రీనివాస్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన శ్రీనివాస్… సరైన డైట్ ఫాలో అవుతూ వర్కవుట్స్ చేస్తున్నాడట.. ఇక లాక్‌డౌన్ సడలింపులతో శ్రీనివాస్ తాజాగా ఫొటోషూట్లో పాల్గొన్నాడు. తన బ్లాక్ రేంజ్ రోవర్ కారు ముందు స్టైలిష్గా.. నిలబడి బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్లో కెమెరాకు పోజులిచ్చాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
