Site icon TeluguMirchi.com

మహేష్ గేమ్ వైరల్

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. సినీ ప్రముఖులు సైతం షూటింగ్ లు బంద్ కావడం తో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ మాత్రం లాక్ డౌన్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

షూటింగ్ ల్లో కాస్త గ్యాప్ దొరికితేనే ఫ్యామిలీతో స్పెండ్ చేసే మహేష్..ఇప్పుడు నెలకు పైగా సమయం దొరకడం తో పిల్లలతో గడుపుతున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంట్లో ఉండి చేస్తున్న పనులని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా మహేశ్ తన కూతురితో టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుతున్న వీడియోను బీఏ రాజు ట్విట్టర్ లో షేర్ చేశారు. సితార కష్టమైన ఒక పదాన్ని పలుకగా..అలా కాదని మహేశ్ చెబుతున్నాడు. అయితే సితార మాత్రం తానే గెలిచానని మహేశ్ తో వాదిస్తోంది. కూతురు సితారతో కలిసి సరదాగా ఆడిన ఈ గేమ్ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Exit mobile version