Site icon TeluguMirchi.com

మహేష్ తక్కువ బడ్జెట్ లో చేయమన్నాడట..

కరోనా వైరస్ తెలుగు చిత్రసీమ ను అతలాకుతలం చేసింది. గత మూడు నెలలుగా థియేటర్స్ బంద్ కావడం , షూటింగ్ ఆగిపోవడం తో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. ఒకవేళ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యినకాని మునపటిలాగా ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో దర్శక , నిర్మాతలు తమ సినిమాల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ను చాల వరకు తగ్గించాలని డిసైడ్ అయ్యారట.

తాజాగా మహేష్ సైతం తన సర్కార్ విషయంలో ఇదే చేయమన్నాడట. సర్కారు వారి పాట బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారట. నిర్మాతలకు మరియు దర్శకులకు ఇప్పటికే మహేష్ దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. వీలైనంత తక్కువ బడ్జెట్ లో మూవీ పూర్తి చేయడం సేఫ్ అని ఆయన సూచించారట. ఒక వేళ థియేటర్స్ విడుదల లేకున్నా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించిన నేపథ్యంలో ఓ టి టి ద్వారా కూడా మంచి లాభాలు ఆర్జించ వచ్చు అని చెప్పకనే చెప్పాడట.

Exit mobile version