Site icon TeluguMirchi.com

వీర సైనికుడికి మహేష్ సెల్యూట్ ..

నిన్న చైనా – ఇండియా సరిహద్దులో జరిగిన దాడి లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల కోసం సంతోష్ చేసిన తాగ్యామ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ వీరి సైనికుడికి వీర సెల్యూట్ చెపుతున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ సైతం పోరులో సైనికులు ప్రాణాలు కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారన్న మహేష్, మీ త్యాగానికి, దేశభక్తికి మా సెల్యూట్ అని చెప్పారు. ఆ సైనికుల కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. ఇక మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేశారు.

Exit mobile version