Site icon TeluguMirchi.com

సూపర్ స్టార్ సూపర్ రికార్డు కొట్టాడు ..

సూపర్ స్టార్ మహేష్ బాబు తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్.. తాజాగా ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా అరుదైన ఫీట్ సాధించి దక్షిణాది తారల్లో టాప్ స్టార్‌గా నిలిచారు

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ, సినిమా విశేషాలే కాకుండా సామజిక అంశాలపై కూడా మహేష్ బాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఆయనను సినీ అభిమానులే కాకుండా సాధారణ నెటిజన్స్ కూడా ఫాలోవర్స్‌గా మారిపోయారు. దీంతో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లు (కోటి) దాటింది. దీంతో దక్షిణాది సినీ తారల్లో కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన వ్యక్తిగా మహేష్ పేరిట రికార్డు నమోదైంది. దక్షిణాది సినీ తారల పరంగా మహేష్ తర్వాత కమల్ హాసన్ 6.1 మిలియన్లు, రజనీకాంత్ 5.7 మిలియన్లు, అల్లు అర్జున్ 4.7 మిలియన్లు, జూనియర్ ఎన్టీఆర్‌ 4.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో కొనసాగుతున్నారు.

Exit mobile version