Site icon TeluguMirchi.com

అల్లరోడికి సూపర్ స్టార్ విషెష్

అల్లరి నరేష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో సినీ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ సైతం త‌న ట్విట్ట‌ర్ ద్వారా న‌రేష్‌కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. మీ జీవితంలో సంతోషం, స‌క్సెస్ ఎల్ల‌ప్ప‌టికీ ఉండాల‌ని కోరుకుంటున్నాను అని తన బెస్ట్ విషెష్ ను అందజేశారు.

మ‌హేష్‌, అల్ల‌రి న‌రేష్ క‌లిసి మ‌హ‌ర్షి అనే చిత్రంలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ ఫ్రెండ్ పాత్ర‌లో క‌నిపించాడు న‌రేష్‌. ఇక న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నాంది చిత్ర టీజర్ విడుద‌ల చేశారు. కొన్నేళ్లుగా మీరందరూ నాపై అంతులేని ప్రేమ, విశ్వాసంతో ఆశ్చర్యపరిచారు, సో.. ఈ పుట్టినరోజుకు నేను అందరినీ ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నానంటూ అని నాంది టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నా అని న‌రేష్ పేర్కొన్నాడు.

Exit mobile version