
అల వైకుంఠపురం లో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన త్రివిక్రమ్ ..ప్రస్తుతం నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిల్లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలుపెట్టాలన్నది ప్లాన్ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు.
ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో విలన్‌గా మంచు మనోజ్‌ను తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. చిత్రంలో బలమైన విలన్ పాత్రకు మంచు మనోజ్ అయితే బాగుంటారని ఎన్టీఆర్ వద్ద త్రివిక్రమ్ ప్రస్తావించారట. ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపడంతో మనోజ్‌ను త్రివిక్రమ్ సంప్రదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మనోజ్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదని అంటున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్‌కు మంచు మనోజ్ విలన్ అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
