
మాములుగా హీరోయిన్లు , డైరెక్టర్లు , నిర్మాతలు ,నటి నటులు చిరంజీవి తో ఒక్క సినిమా అయినా చేయాలనీ అనుకుంటారు. వేదిక ఛాన్స్ వస్తే ఇదే విషయాన్నీ చెపుతారు. కానీ చిరంజీవినే ఓ హీరోయిన్ తో నటించాలని ఉందని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాప్సి ప్రధాన పాత్రలో మిషన్ ఇంపాజిబుల్ అనే మూవీ తెరకెక్కింది. ఏప్రిల్ 01 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమోషన్ లలో భాగంగా నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భాంగా చిరంజీవి మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సీలాంటి ఆర్టిస్ట్‌లతో నటించే అవకాశం దక్కలేదు. ప్రతిభ ఉన్న ఇలాంటి ఆర్టిస్ట్‌లను చూసినప్పుడు నేనెందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అనిపిస్తుంది. అవకాశం వస్తే తాప్సీతో సినిమా చేయాలనుంది’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చిరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
