
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం సరిలేరు నీకెవ్వరూ. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి వార్తల్లో నిలిచింది.
బ్లాజ్ & రాణిన రెడ్డి ఈ సాంగ్ ను పాడగా..శ్రీ మని & దేవి శ్రీ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు థియేటర్స్ లలో అందరి చేత స్టెప్స్ వేయించింది. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక నటిస్తుండగా..సీనియర్ హీరోయిన్ సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మించారు.
