
అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో అఖిల్ నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా లాక్ డౌన్ కారణంగా సినిమా కు బ్రేక్ పడింది. త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఈ సినిమాను ఓటిటి రిలీజ్ చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దీంతో చిత్ర యూనిట్ ఆ వార్తల ఫై క్లారిటీ ఇచ్చింది.
ఈ సినిమా విడుదల గురించి అవన్నీ రూమర్స్ అని.. ఎంత ఆలస్యమైనా తమ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. అయితే దసరా కానుకగా ‘బ్యాచ్‌లర్’ రాక ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.
