Site icon TeluguMirchi.com

కరోనా నుండి బయటపడాలంటే ఇలా చేయాలంటున్న నాగ్..

కరోనా మహమ్మారి హైదరాబాద్ లో విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు వందల కేసులు పెరుగుతుండడం తో నగరవాసులు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున కరోనా నుండి బయటపడాలంటే ఇలా చేయండి అంటూ ఓ మెసేజ్ ఇచ్చారు.

ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి గల ఒకటే మార్గం…మనం దృఢంగా మారడమే అంటున్నారు హీరో నాగార్జున. ఫిట్ అండ్ హెల్తీగా ఉండడం ద్వారా కరోనాను జయించవచ్చని ఆయన చెవుతున్నారు. దీనికోసం కోవిడ్ బారినపడి కోలుకున్న శిల్పా రెడ్డి వీడియో ఒకటి షేర్ చేశారు నాగార్జున. ఆ వీడియోలో శిల్పా రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలు, ఆమె అనుభవాలు తెలియజేశారు.

శిల్పా రెడ్డి మాట్లాడుతూ ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా కరోనా మాకు సోకింది అన్నారు. కరోనా సోకినప్పటికీ వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనపడలేదట. ఫిట్ గా ఉంటూ ఆరోగ్యంగా ఉన్న వారు ఎటువంటి చికిత్స లేకుండే దీనిని జయించవచ్చు అనిచెవుతున్నారు. వ్యాయామం వంటి విషయాల ద్వారా ఆరోగ్యం మరియు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకొని కరోనా వైరస్ పై గెలవచ్చు అని శిల్పారెడ్డి సలహా ఇస్తున్నారు.

Exit mobile version