
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు లక్షల మధ్య ప్రాణాలు గాల్లో కలిసాయి. ఈ వైరస్ కారణంగా ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో నాగార్జున పెద్ద రిస్క్ చేస్తున్నాడు.
లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ షెడ్యూల్ థాయిలాండ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్ మరియు ముంబైలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా నెక్స్ట్ షెడ్యూల్ కొరకు థాయిలాండ్ వెళ్లనున్నారని సమాచారం. మరి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో విదేశాలలో షూటింగ్ అంటే పెద్ద రిస్క్ అని అంత అంటున్నారు.
