Site icon TeluguMirchi.com

నాగ్ సరసన ఇలియానా..?

దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన గోవా బ్యూటీ ఇలియానా..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యం గా యూత్ అయితే అమ్మడి నడుము ఒంపులకు ఫిదా అయ్యారు. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం తో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఆ స్థాయి ని నిలుపుకోలేపోయింది.

రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ కు బై బై చెప్పి..మళ్లీ సినిమాల ఫై ఫోకస్ చేసింది. కానీ ఛాన్సులు మాత్రం మునపటి మాదిరిగా రాలేకపోతున్నాయి. తాజాగా నాగ్ సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చినట్లు టాలీవుడ్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన ‘రైడ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారట ప్రవీణ్ సత్తారు. తెలుగు నెటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి నాగార్జున హీరోగా ఈ మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే నాగ్ సరసన ఇలియానా అయితే బాగుంటుందని, పైగా ఒరిజినల్ వర్షన్‌లో ఆమెనే నటించింది కాబట్టి సరైన న్యాయం జరుగుతుందని భావించిన ప్రవీణ్ సత్తారు.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్.

Exit mobile version