Site icon TeluguMirchi.com

నాంది న్యూ పోస్టర్ రిలీజ్

గత కొంతకాలం గా హీరోగా వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న అల్లరి నరేష్ ..ప్రస్తుతం విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్‌.వి. 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న నిర్మాణంలో ‘నాంది’ అనే సినిమా చేస్తున్నాడు. అల్ల‌రి న‌రేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటుంది.

లేటెస్టుగా జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయబోతున్నట్లు అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ”జూన్ 30 మంగళవారం – మీరందరూ ‘నాంది’ యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయడానికి సాక్ష్యంగా నిలవండి” అంటూ ట్వీట్ చేసారు. ఈ సినిమా కోసం బ్రహ్మకడలి, ఛోటా.కె.ప్రసాద్‌, శ్రీచరణ్‌ పాకాల, అబ్బూరి రవి వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు. సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్‌ పాకాల అందిస్తున్నారు.

Exit mobile version