
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. అవకాశాలు లేకనే సుశాంత్ మరణించాడని..కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తలు ఆయనకు ఛాన్సులు రాకుండా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే కొంతమంది నటి నటులు సైతం తమకు ఎదురైనా సంఘటనలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్ సైతం సూసైడ్ చేసుకోవాలి అనుకున్నానని తెలిపి షాక్ ఇచ్చింది.నందినీ రాయ్ 2015లో మోసగాళ్లకు మోసగాళ్లు అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత చిత్రలు అంతగా ఆడకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో తాను డిప్రెషన్‌కు లోనయ్యాయని తెలిపారు. ఇండస్ట్రీలో విజయాలతో పాటు పాపులారిటీ, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. క్రమంగా మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌కు లోనవుతారు అని నందినీ రాయ్ చెప్పారు.
బిగ్‌బాస్‌లోకి రాకముందు రెండేళ్ల పాటు తాను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నానని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆటోచనలు తనను వెంటాడాయని చెప్పారు. డిప్రెషన్‌ను తగ్గించుకునేందు స్నేహితులతో మాట్లాడి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడానని, చికిత్స కూడా తీసుకున్నానని తెలిపారు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నలుగురితో కలవడానికి ఇష్డపడరు. ఫ్యామిలీకి దూరంగా ఉంటారని నందినీ రాయ్ అభిప్రాయపడ్డారు.
