Site icon TeluguMirchi.com

నందిత ‘ఐపీసీ 376’ ట్రైలర్ రిలీజ్ ..

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ ‘అభినేత్రి 2’ లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత నటించిన తాజా చిత్రం ‘ఐపీసీ 376’. ఈ చిత్రాన్ని రామ్ కుమార్ సుబ్బరామన్ దర్శకత్వం వహించగా. పవర్ కింగ్ స్టూడియోస్ బ్యానర్ లో ఎస్. ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

నందిత ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అదరగొట్టబోతోంది. ఇప్పటికే ‘ఐపీసీ 376’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 1. 23 నిముషాలు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందొ మీరు ఓ లుక్ వెయ్యండి.

Exit mobile version